ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeవిధ్యఇంటర్ విద్యార్థులకు గొప్ప అవకాశం

ఇంటర్ విద్యార్థులకు గొప్ప అవకాశం

📰 Generate e-Paper Clip

హెలెన్ కెల్లర్ ఇన్‌స్టిట్యూట్‌లో కొత్త ప్రొఫెషనల్ కోర్సులు ప్రారంభం

 క్లినికల్ సైకాలజీ, BASLP, స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, జూన్ 22 (వార్త సంద్య ): దివ్యాంగుల విద్య, పునరావాస రంగాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన హెలెన్ కెల్లర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రన్ (HKIRRDC) 2026-27 విద్యా సంవత్సరానికి మూడు కొత్త ప్రొఫెషనల్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ పి. ఉమ్మర్ ఖాన్, డైరెక్టర్ డాక్టర్ ఆర్ముగం, ప్రొఫెసర్ కృష్ణ, అకాడమిక్ కన్సల్టెంట్ ఆర్.ఆర్.ఆర్. మూర్తి ఈ వివరాలను వెల్లడించారు.

న్యూఢిల్లీలోని రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI) గుర్తింపు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధంతో ఈ కోర్సులు నిర్వహించబడనున్నాయని తెలిపారు.

ఈ విద్యా సంవత్సరంలో బీఎస్సీ క్లినికల్ సైకాలజీ (ఆనర్స్), బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (BASLP), ఇంటిగ్రేటెడ్ స్పెషల్ అండ్ ఇంక్లూజివ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (B.A., B.Ed., Spl.Edu.-HI) కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మూడు కోర్సుల కాలవ్యవధి నాలుగు సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.

బీఎస్సీ క్లినికల్ సైకాలజీ, BASLP కోర్సులకు ఇంటర్మీడియట్‌లో బైపీసీ లేదా ఎంపీసీ గ్రూపుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఇంటిగ్రేటెడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుకు ఏ గ్రూప్ విద్యార్థులైనా అర్హులేనని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని వివరించారు.

ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లు కల్పిస్తామని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత RCI రిజిస్ట్రేషన్ పొందే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

బీఎస్సీ క్లినికల్ సైకాలజీ, ఇంటిగ్రేటెడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంవత్సరానికి రూ.1 లక్ష చొప్పున ఫీజు ఉండగా, BASLP కోర్సుకు మొదటి మూడు సంవత్సరాలు సంవత్సరానికి రూ.2 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నాలుగో సంవత్సరం ఇంటర్న్‌షిప్ సమయంలో ఎలాంటి ఫీజు ఉండదని, ఇంటర్న్‌షిప్ చేస్తున్న విద్యార్థులకు ప్రతినెల రూ.4,000 స్టైపెండ్ అందజేస్తామని వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్, రిహాబిలిటేషన్, ఆడియాలజీ రంగాల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉందని, ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లు, ప్రత్యేక పాఠశాలలు, కార్పొరేట్ సంస్థల్లో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఆసక్తి గల విద్యార్థులు జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు 93966 62158, 90149 18093 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!