ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిఆగిపోయిన చదువుకు మళ్లీ ఊపిరి పోసిన శ్రీ మాతా సేవ చారిటబుల్

ఆగిపోయిన చదువుకు మళ్లీ ఊపిరి పోసిన శ్రీ మాతా సేవ చారిటబుల్

📰 Generate e-Paper Clip

9వ నారాయణ సేవ కార్యక్రమం – ఆగిపోయిన చదువుకు మళ్లీ ఊపిరి పోసిన శ్రీమాతా సేవ చారిటబుల్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి  జూన్ 30 ( వార్త సంధ్య)

 

కామారెడ్డి: పేదరికం కారణంగా 8వ తరగతి పూర్తి చేసిన అనంతరం ఏడాది పాటు చదువుకు దూరమైన విద్యార్థి రామ్ చరణ్ జీవితంలో శ్రీమాతా సేవ చారిటబుల్ మరోసారి ఆశాకిరణం నింపింది. ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆగిపోయిన విషయం తెలుసుకున్న ట్రస్ట్ సభ్యులు మానవత్వంతో స్పందించి, అతని విద్యాభవిష్యత్తుకు అండగా నిలిచారు.

 

శ్రీమాతా సేవ చారిటబుల్ నిర్వహించిన సేవ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్‌ను ఎస్సీ వాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరిగి 9వ తరగతిలో చేర్పించారు. అలాగే, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు చదువుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ హాస్టల్‌లో కూడా ప్రవేశం కల్పించారు.

 

ఈ సేవా కార్యక్రమం ద్వారా ఒక విద్యార్థి జీవితంలో కొత్త ఆశలు చిగురించడంతో స్థానికులు ట్రస్ట్ సభ్యులను అభినందించారు. “చదువు ఆగిపోవచ్చు… కానీ ఒక మంచి మనసు అండగా నిలిస్తే భవిష్యత్తు మళ్లీ ప్రారంభమవుతుంది” అనే సందేశాన్ని ఈ కార్యక్రమం సమాజానికి చాటిచెప్పింది.

 

ఈ కార్యక్రమంలో శ్రీమాతా సేవ చారిటబుల్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ దత్త, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, సాయిరాం, భాస్కర్ రావు, భాస్కర్ చారి పాల్గొన్నారు.

 

“ప్రతి చిన్నారి చదువు మనందరి బాధ్యత… ఒక విద్యార్థిని ఆదుకోవడం అంటే ఒక కుటుంబ భవిష్యత్తును నిలబెట్టినట్టే.” అనే లక్ష్యంతో శ్రీమాతా సేవ చారిటబుల్ తన సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!