ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డికామారెడ్డి జిల్లాలో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ప్రభుత్వ వసతి గృహాల్లో కలకలం

కామారెడ్డి జిల్లాలో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ప్రభుత్వ వసతి గృహాల్లో కలకలం

📰 Generate e-Paper Clip

బ్రేకింగ్ న్యూస్

కామారెడ్డి జిల్లాలో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ప్రభుత్వ వసతి గృహాల్లో కలకలం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 10 ( వార్త సంధ్య )

కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆత్మహత్యాయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బాన్సువాడ ఘటన మరువకముందే, సదాశివనగర్ బీసీ బాలుర వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి మెడకు రబ్బర్ బ్యాండ్లు చుట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వార్డెన్ అప్రమత్తంగా స్పందించడంతో విద్యార్థిని వెంటనే రక్షించి ప్రమాదాన్ని తప్పించారు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేకపోవడం, ఒంటరితనం కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ వసతి గృహాల్లో వరుసగా ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులకు తగిన కౌన్సెలింగ్, పర్యవేక్షణ, భావోద్వేగ మద్దతు కల్పించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!