
వార్త సంధ్య న్యూస్ ఫార్మాట్
జర్నలిస్ట్: అంజి
హైదరాబాద్, జూన్ 26
ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్
వార్త:
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో డెమోక్రాటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (DATA) ఆధ్వర్యంలో పలు సామాజిక సంస్థలు, విద్యావేత్తలు, మేధావులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఉన్నత విద్యను పరిరక్షించడంతో పాటు అధ్యాప
కుల హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలోని అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ, వృత్తి విద్యా సంస్థలు AICTE, UGC, TSCHE మరియు తెలంగాణ విద్యా చట్టం-1982 నిబంధనలను పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధ్యాపకుల ఉద్యోగ భద్రత దెబ్బతింటోందని, విద్యార్థుల విద్యా ప్రమాణాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు.
అధ్యాపకులను చట్టవిరుద్ధంగా తొలగించడం, వేతనాల చెల్లింపులో పారదర్శకత లేకపోవడం, సేవా హక్కులను నిరాకరించడం వంటి సమస్యలు విస్తృతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను వెంటనే సరిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ విద్యా సంస్థల్లో AICTE, UGC, TSCHE నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, Student Faculty Ratio (SFR)ను తప్పనిసరిగా అమలు చేయాలని, నియామకాలు మరియు వేతనాల్లో పారదర్శకత తీసుకురావాలని కోరారు.
అలాగే అక్రమాలపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రతి సెమిస్టర్ మధ్యలో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించాలని, విద్యా నాణ్యతను కాపాడేందుకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అధ్యాపకులను రక్షించడం అంటే విద్యా ప్రమాణాలను రక్షించినట్లేనని, విద్యా ప్రమాణాలను కాపాడడం అంటే సమాజ భవిష్యత్తును రక్షించినట్లేనని DATA ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బైట్ పాయింట్స్:
ప్రైవేట్ విద్యా సంస్థల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి.
అధ్యాపకుల ఉద్యోగ భద్రత, సేవా హక్కులను రక్షించాలి.
SFR నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలి.
నియామకాలు, వేతనాల్లో పారదర్శకత ఉండాలి.
అక్రమాలపై స్వతంత్ర విచారణ చేపట్టాలి.
ప్రతి సెమిస్టర్‌లో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించాలి.

