ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిడిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో వాకర్స్‌తో కలిసి నడక.. మొక్కలు నాటిన డాక్టర్ పైడి ఎల్లారెడ్డి

డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో వాకర్స్‌తో కలిసి నడక.. మొక్కలు నాటిన డాక్టర్ పైడి ఎల్లారెడ్డి

📰 Generate e-Paper Clip

డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో వాకర్స్‌తో కలిసి నడక.. మొక్కలు నాటిన డాక్టర్ పైడి ఎల్లారెడ్డి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి  జూన్ 25 ( వార్త సంధ్య )

, ప్రముఖ శాస్త్రవేత్త  బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌ను సందర్శించి వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. 14వ వార్డు పరిధిలోని రాశివనం, డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వాకర్స్‌తో కలిసి నడిచి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాశివనం, డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి గ్రౌండ్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రావు, ఆర్‌కే కళాశాలల గ్రూప్ చైర్మన్ డాక్టర్ జైపాల్ రెడ్డి, రాజేశ్వర్ రావు, రవీందర్ రావు, రాంశెట్టి భూపతి, గేరిగంటి లక్ష్మీనారాయణ, రాజిరెడ్డి, సంతోష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!