కామారెడ్డిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలి: బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 7 ( వార్తా సంధ్య )
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకులు అధికారులను కోరారు.
క్షేత్రస్థాయిలో సమగ్ర సమీక్ష నిర్వహించి, ఓటరు నమోదు ప్రక్రియను సక్రమంగా అమలు చేయాలని, బీఎల్‌ఓల పనితీరు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతు కాకుండా ప్రతి దరఖాస్తును ఒకటికి రెండుసార్లు పరిశీలించి, ఓటరు జాబితా ఫారాల పరిశీలనలో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ప్రజల్లో ఎస్‌ఐఆర్ విధానంపై ఇంకా అనేక అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక సమీక్ష సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి, మీర్జా హఫీజ్ బేగ్, కుంబాల రవి యాదవ్, మామిండ్ల లక్ష్మణ్, అజాజ్, మన్సూర్, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

