ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeఇంటర్నేషనల్ఆరోగ్యంబొల్లిమచ్చలు (విటిలిగో) చికిత్సలో ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి

బొల్లిమచ్చలు (విటిలిగో) చికిత్సలో ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, వార్త సంధ్య : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బొల్లిమచ్చలు (విటిలిగో/తెల్లపూత) వ్యాధిపై వైద్య నిపుణులు పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 3 నుండి 5 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, భారతదేశంలో కూడా ఇటీవలి కాలంలో దీని ప్రభావం పెరుగుతోందని తెలిపారు.

అనువంశిక కారణాలు, ఆటో ఇమ్యూన్ సమస్యలు, విటమిన్-డి మరియు విటమిన్-బి లోపాలు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. అదేవిధంగా మారుతున్న జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, మానసిక ఒత్తిడి, కాలుష్యం వంటి అంశాలు కూడా వ్యాధి పెరుగుదలకు దోహదపడుతున్నాయని వివరించారు.

బొల్లిమచ్చలతో బాధపడేవారు ఆత్మవిశ్వాసంతో చికిత్స ప్రారంభించాలని, ప్రతిరోజూ యోగా లేదా ధ్యానం చేయాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల రసాలు తీసుకోవడం, గ్రీన్ టీ సేవించడం, మొలకెత్తిన గింజలు ఆహారంలో చేర్చుకోవడం మంచిదని తెలిపారు.

టార్గెట్ UVB లేజర్ చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉందని, ఈ విధానంలో కేవలం తెల్లమచ్చలపై మాత్రమే కిరణాలు ప్రసరింపజేస్తారని చెప్పారు. దీంతో శరీరంలోని ఇతర భాగాలకు ఎలాంటి ప్రభావం ఉండదని వివరించారు. చికిత్స సమయంలో నొప్పి లేదా మంట ఉండదని, రెండు నుంచి మూడు వారాల్లో మార్పులు కనిపించడం ప్రారంభమవుతుందని తెలిపారు.

అయితే అరచేతులు, అరికాళ్లు, పెదవులు మరియు తెల్ల వెంట్రుకలు ఉన్న ప్రాంతాల్లో ఫలితాలు నెమ్మదిగా కనిపించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. సాధారణంగా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చికిత్స అవసరమవుతుందని, 25 నుండి 30 సిట్టింగ్స్ వరకు అవసరం కావచ్చని తెలిపారు.

మెడికల్ చికిత్సకు స్పందించని రోగులకు విటిలిగో సర్జరీ కూడా అందుబాటులో ఉందని, దీనివల్ల నిరోధక మచ్చలను తగ్గించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బొల్లిమచ్చలు (విటిలిగో/తెల్లపూత) వ్యాధిపై వైద్య నిపుణులు పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 3 నుండి 5 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, భారతదేశంలో కూడా ఇటీవలి కాలంలో దీని ప్రభావం పెరుగుతోందని తెలిపారు.

అనువంశిక కారణాలు, ఆటో ఇమ్యూన్ సమస్యలు, విటమిన్-డి మరియు విటమిన్-బి లోపాలు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. అదేవిధంగా మారుతున్న జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, మానసిక ఒత్తిడి, కాలుష్యం వంటి అంశాలు కూడా వ్యాధి పెరుగుదలకు దోహదపడుతున్నాయని వివరించారు.

బొల్లిమచ్చలతో బాధపడేవారు ఆత్మవిశ్వాసంతో చికిత్స ప్రారంభించాలని, ప్రతిరోజూ యోగా లేదా ధ్యానం చేయాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల రసాలు తీసుకోవడం, గ్రీన్ టీ సేవించడం, మొలకెత్తిన గింజలు ఆహారంలో చేర్చుకోవడం మంచిదని తెలిపారు.

టార్గెట్ UVB లేజర్ చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉందని, ఈ విధానంలో కేవలం తెల్లమచ్చలపై మాత్రమే కిరణాలు ప్రసరింపజేస్తారని చెప్పారు. దీంతో శరీరంలోని ఇతర భాగాలకు ఎలాంటి ప్రభావం ఉండదని వివరించారు. చికిత్స సమయంలో నొప్పి లేదా మంట ఉండదని, రెండు నుంచి మూడు వారాల్లో మార్పులు కనిపించడం ప్రారంభమవుతుందని తెలిపారు.

అయితే అరచేతులు, అరికాళ్లు, పెదవులు మరియు తెల్ల వెంట్రుకలు ఉన్న ప్రాంతాల్లో ఫలితాలు నెమ్మదిగా కనిపించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. సాధారణంగా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చికిత్స అవసరమవుతుందని, 25 నుండి 30 సిట్టింగ్స్ వరకు అవసరం కావచ్చని తెలిపారు.

మెడికల్ చికిత్సకు స్పందించని రోగులకు విటిలిగో సర్జరీ కూడా అందుబాటులో ఉందని, దీనివల్ల నిరోధక మచ్చలను తగ్గించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!