ePaper
Saturday, June 6, 2026
📄 ePaper
Homeఇంటర్నేషనల్మలేషియాలో కేటీఆర్‌కు ఘన స్వాగతం

మలేషియాలో కేటీఆర్‌కు ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా కౌలాలంపూర్ చేరిక
  • ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకుల నుంచి ఆత్మీయ స్వాగతం
  • జూన్ 6న మైటా ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
  • కేటీఆర్ రాకతో ప్రవాస తెలంగాణ సమాజంలో ఉత్సాహం
  • వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు

కౌలాలంపూర్, జూన్ 5 (వార్త సంధ్య): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కుటుంబ సమేతంగా మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ మలేషియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన మలేషియాకు వెళ్లారు.
కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రవాస తెలంగాణ ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూలగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించారు.
స్వాగతం పలికిన వారిలో గాదరి కిశోర్ కుమార్, మైటా అధ్యక్షుడు తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి తదితర ప్రముఖులు, ఎన్నారైలు పాల్గొన్నారు.
కేటీఆర్ మలేషియా పర్యటనతో అక్కడి ప్రవాస తెలంగాణ సమాజంలో కొత్త ఉత్సాహం నెలకొంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మైటా, బీఆర్ఎస్ మలేషియా కమిటీలు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాస తెలంగాణవాసులు పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!