ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homebusinessస్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతిపత్రం

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతిపత్రం

📰 Generate e-Paper Clip

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతిపత్రం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 25 ( వార్త సంధ్య )

స్వర్ణకారుల సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం మరియు కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

 

ఈ సందర్భంగా స్వర్ణకారులు 272 జీవోలో సవరణలు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన స్వర్ణకారులకు నెలకు రూ.5,000 పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వృత్తికి సంబంధించిన ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.

 

వినతిపత్రం సమర్పణకు ముందు స్వర్ణకారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి స్వర్ణ కాంప్లెక్స్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

 

కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు మంచోళ్ల రాజమౌళి, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు కంసాలి ప్రహ్లాద్ చారి, కోశాధికారి సిహెచ్ శశికుమార్, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు మరికంటి పి. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బసవపురం ఎం. ప్రభాకర్, కోశాధికారి శేషు కుమార్, ఉపాధ్యక్షుడు డి.ఆర్. కేశవ్, సహాయ కార్యదర్శి చింతామణి శేఖర్, యువజన సంఘం అధ్యక్షులు ఎల్. ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏ. సంతోష్, కాచపురం చంద్రశేఖర్, వైవి రమణతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!