భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 18 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల ఎంపీడీవో కుమారి గోపిశెట్టి సుష్మిత లక్ష్మీదేవిపల్లి మండలంలో శనివారం లాల్ తండా గ్రామపంచాయతీని ఆకస్మికంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్‌ను సందర్శించి వైద్య సేవల అమలును పరిశీలించారు.

అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న సేవలు, పోషకాహార పంపిణీ, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. తదుపరి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎంపీడీవో, రోజువారీ పరిపాలనా పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవల అమలుపై పలు అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

