ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికతహఫీజ్‌పేట్‌లో డీఆర్‌ఏ అకాడమీ గణేశ ఆర్ట్ ఎగ్జిబిషన్

హఫీజ్‌పేట్‌లో డీఆర్‌ఏ అకాడమీ గణేశ ఆర్ట్ ఎగ్జిబిషన్

📰 Generate e-Paper Clip

విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా రెండు రోజుల కళా ప్రదర్శన

23 మంది విద్యార్థుల విభిన్న శైలుల గణేశ చిత్రాలు ప్రదర్శన

300 మందికి పైగా సందర్శకుల సందడి

హైదరాబాద్, తేదీ 14-9-2026 (వార్త సంధ్య):

హఫీజ్‌పేట్‌లో డీఆర్‌ఏ అకాడమీ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు గణేశ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థుల్లోని కళా ప్రతిభను వెలికితీసి, వారి సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది విద్యార్థులు రూపొందించిన విభిన్న శైలుల గణేశ చిత్రాలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. సంప్రదాయ కళా శైలులతో పాటు విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలు ప్రతిబింబించేలా రూపొందించిన చిత్రాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. రెండు రోజుల్లో 300 మందికి పైగా సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శించి విద్యార్థుల కళాకృతులను అభినందించారు.

ఎగ్జిబిషన్‌ తొలిరోజు బియాండ్ స్కూల్ ప్రిన్సిపల్ వనీలా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల కళాకృతులను పరిశీలించారు. రెండో రోజు ఫిల్మ్ డైరెక్టర్, ఆర్టిస్ట్, స్క్రిప్ట్ రైటర్ శ్రీపతి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

ఈ సందర్భంగా డీఆర్‌ఏ అకాడమీ సీఈఓ ప్రతిమ బోటు మాట్లాడుతూ, గణేశుడి ఆశీస్సులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో గణేశ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల్లోని కళా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, వారికి తమ సృజనాత్మకతను ప్రదర్శించేందుకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటి కళా ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు.

 

 

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!