ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeరాజకీయంలంబాడీలకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి.. బంజారా బస్సు యాత్రను అడ్డుకుంటాం: కోర్ర మోతిలాల్ నాయక్

లంబాడీలకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి.. బంజారా బస్సు యాత్రను అడ్డుకుంటాం: కోర్ర మోతిలాల్ నాయక్

📰 Generate e-Paper Clip

లంబాడీల సమస్యలను పరిష్కరించకుండా ‘బంజారా బస్సు యాత్ర’ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని, ఈ యాత్రను అడ్డుకుంటామని సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కోర్ర మోతిలాల్ నాయక్ హెచ్చరించారు.

ఈరోజు సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కోర్ర మోతీలాల్ నాయక్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకర్ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు కొత్త డ్రామా తెరలేపుతున్నారు 3 ఏళ్లు గడుస్తున్న గిరిజనులకు ఒక హామీ కూడా నెరవేర్చలేదు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న నలుగురు లంబాడి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు, ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ లంబాడీల బస్సు యాత్ర పేరుతో నియోజకవర్గాల వారీగా తండాలలో తిరగడానికి ముందు ఈ 30 నెలలో గిరిజనులకు కల్పించిన ప్రయోజనాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి నిలదీశారు. లేకుంటే బస్సు యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో ప్రకటించిన చేవెళ్ల డిక్లేర్ గిరిజనుల అభ్యున్నతికి

సంబంధించిన పలు కీలక హామీలు ఏమైందో సమాధానం చెప్పాలనీ, 50 సంవత్సరాల రిజర్వేషన్ పేరిట స్వర్ణోత్సవాలు జరపటం హాస్యస్పందంగా ఉందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమకుతాము న్యాయం చేసుకునే స్థితిలో

లేరనే విషయాన్ని గమనించాలి చెప్పారు. మీ స్థాయి ఏమిటో తెలుసుకోవాలని ఎద్దేవ చేశారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి నుండి ఇప్పటివరకు మీరు ఏం సాధించారో గిరిజన సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

గ్రామాల నుండి గిరిజన లంబాడి విద్యార్థులు పట్టణాలకు వస్తే, కనీసం

చదువుకోవడానికి ఉండటానికి హాస్టల్ వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ లో సీటు లేక ప్రైవేట్ హాస్టల్లో డబ్బులు కట్టలేక ఫంక్షన్ హాల్ లో పనిచేస్తున్న విద్యార్థుల గురించి మీ ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించిందా అని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ లేక గిరిజన విద్యార్థులకు ప్రవేట్ కాలేజీ యజమానులు టిసి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. బంజారాలకు ఉన్నత విద్య నుండి దూరం

చేస్తున్నారు. ఉద్యోగాలు రాక విలువిలలాడుతున్న నిరుద్యోగుల సమస్యల గురించి మీ ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించిందా?, ప్రభుత్వ శాఖలలో ఉన్న వేలాది backlog ఖాళీలను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. GHMC పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్లకు అబ్బదపూ మాటలతో వారిని ప్రభుత్వం అగం చేసిందని అవేదనవ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ లంబాడీల బస్సు యాత్రని అన్ని సంఘాల ఆధ్వర్యంలో గాంధీ భవన్

ముట్టడించి, వారి యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల కంటే గిరిజనుల సంక్షేమమే మాకు ముఖ్యమని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!