చండ్రుగొండ ప్రతినిధి, జూన్ 21 (వార్త సంధ్య) : వాసవి క్లబ్ చంద్రుగొండ వారి ఆధ్వర్యంలో ఆదివారం “డాన్ టు డస్క్” సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వీఎన్‌కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి అక్కిరాల శ్రీనివాస్ (ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – మల్టీపుల్) హాజరయ్యారు. గెస్ట్ ఆఫ్ హానర్‌గా వీఎన్‌కేసీజీఎఫ్ గుండా లక్ష్మీ సింధూర (ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్), దూపకుంట్ల అనిల్ కుమార్ (చైర్ పర్సన్), సీమకుర్తి నాగరాజు తరుణ్ (జోన్ చైర్ పర్సన్-1), దూపకుంట్ల లక్ష్మీ అలేఖ్య (రీజియన్ సెక్రటరీ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోశాలలో పశువులకు మేత పంపిణీ చేయడంతో పాటు బస్టాండ్ ఆవరణలో బ్లడ్ డోనర్స్ పేర్ల పోస్టర్లు, ఎమర్జెన్సీ నంబర్ల పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజల కోసం పబ్లిక్ ప్రదేశాల్లో సిమెంట్ బల్లలను ఏర్పాటు చేశారు. ప్రతిభ కనబరిచిన పది మంది విద్యార్థులను శాలువాలతో సత్కరించి, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందజేశారు. అలాగే వాసవి క్లబ్‌లో ఐదుగురు నూతన సభ్యులను చేర్చడంతో పాటు ముగ్గురు ఐకాన్ రిజిస్ట్రేషన్లు, ముగ్గురు కేజీసీఎఫ్ విరాళ సభ్యత్వాలను నమోదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ డోనర్స్ పేర్లు, ఎమర్జెన్సీ నంబర్ల పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ చంద్రుగొండ అధ్యక్షుడు వీఎన్ కుక్కడప్పు నాగేశ్వరరావు, కార్యదర్శి సంకా సునీల్, ఖజాంచి కుక్కడప్పు కుశల్ ప్రసాద్, మాజీ అధ్యక్షుడు పద్మనాభుని కృష్ణారావు, కుక్కడప్పు కిరణ్, వాగు సాయి, కుక్కడప్పు హరిబాబు తదితర వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా “డాన్ టు డస్క్” సేవా కార్యక్రమం
RELATED ARTICLES

