ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeఇంటర్నేషనల్ఆరోగ్యంమున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రైన్‌కోట్లు, హ్యాండ్ గ్లౌజ్‌ల పంపిణీ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ చేతుల...

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రైన్‌కోట్లు, హ్యాండ్ గ్లౌజ్‌ల పంపిణీ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ చేతుల మీదుగా రక్షణ సామగ్రి అందజేత

📰 Generate e-Paper Clip

  • మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రైన్‌కోట్లు, హ్యాండ్ గ్లౌజ్‌ల పంపిణీ
  • ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ చేతుల మీదుగా రక్షణ సామగ్రి అందజేత

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 7 ( వార్త సంధ్య)

జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రైన్‌కోట్లు, హ్యాండ్ గ్లౌజ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కార్మికులకు రక్షణ సామగ్రిని అందజేశారు.

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలకు నిరంతర పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం, భద్రతకు మున్సిపాలిటీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వర్షంలో విధులు నిర్వహించే కార్మికులకు అవసరమైన రక్షణ సామగ్రిని అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

 

ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమం కోసం భవిష్యత్తులో కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్‌పర్సన్ కాసార్ల గోదావరి స్వామి, కౌన్సిలర్లు అఖిల, హఫీజ్, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!