ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిమానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు

మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు

📰 Generate e-Paper Clip

🚨 బ్రేకింగ్ న్యూస్

మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి  జులై 7 (వార్తా సంధ్య ) గన్నారం స్టేజ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాడ్వాయి మండలం దేమికలాం గ్రామానికి చెందిన అంబీర్ లక్ష్మణరావు వద్ద ఉన్న సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, రూ.2,550 నగదు, మొబైల్ ఫోన్ను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు భద్రపరిచి, బాధితుడి కుమారుడు గోపీరావుకు అప్పగించారు.

విలువైన వస్తువులను ఎలాంటి లోటు లేకుండా కుటుంబ సభ్యులకు అందజేసిన హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు నిజాయితీ, సేవాభావానికి స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!