వార్త సంధ్య : ప్రతినిధి
జూలై 25-26న హైదరాబాద్‌లో విశ్వమాంగ
జూలై 26న దేశ ప్రబుద్ధ మాతృశక్తితో ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ప్రత్యేక సంభాషణ
VISHWAMANGALYA SABHA | HYDERABAD
విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో దక్షిణ భారత ప్రబోధన

సమావేశం ఈ నెల జూలై 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సంస్థ జాతీయ సంస్థ మంత్రి వృషాలి జోషి వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలుగా విశ్వమాంగల్య సభ దేశవ్యాప్తంగా మాతృశక్తి సాధికారత, కుటుంబ విలువలు, సామాజిక చైతన్యం కోసం కృషి చేస్తోందని తెలిపారు.
“న మాతుః పర దైవతమ్” అనే ధ్యేయంతో మహిళల సామాజిక, సాంస్కృతిక, వైచారిక అభివృద్ధికి సంస్థ పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం దేశంలోని 33 ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ఇటీవల 23 ప్రాంతాల్లో మహిళా అధివేశనాలు నిర్వహించినట్లు చెప్పారు.
ఈ ఏడాది సమావేశంలో ప్రధాన ఆకర్షణగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్‌సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ దేశంలోని ప్రబుద్ధ మహిళలతో “యుగానుకూల మాతృత్వం” అంశంపై ప్రత్యేక ఉపన్యాసం, సంభాషణ నిర్వహించనున్నట్లు తెలిపారు.
జూలై 25, 26 తేదీల్లో యూసుఫ్‌గూడలోని NI-MSMEలో దక్షిణ భారత ప్రబోధన సమావేశం జరగనుండగా, జూలై 26 సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లోని కొమరం భీమ్ ఆదివాసి భవన్లో ప్రత్యేక సంభాషణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రశ్నోత్తరాల సెషన్ కూడా ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశానికి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా తదితర రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది ప్రతినిధి మహిళలు, అలాగే ప్రత్యేక కార్యక్రమానికి 1300 నుంచి 1500 మంది మహిళలు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులు తప్పకుండా హాజరుకావాలని విశ్వమాంగల్య సభ జాతీయ సంస్థ మంత్రి వృషాలి జోషి విజ్ఞప్తి చేశారు.
బైట్ పాయింట్స్:
జూలై 25-26న హైదరాబాద్‌లో విశ్వమాంగల్య సభ దక్షిణ భారత సమావేశం.
NI-MSME, యూసుఫ్‌గూడలో ప్రధాన సమావేశాలు.
జూలై 26న కొమరం భీమ్ ఆదివాసి భవన్లో ప్రత్యేక కార్యక్రమం.
డా. మోహన్ భాగవత్ “యుగానుకూల మాతృత్వం” అంశంపై ప్రసంగం.
దక్షిణ భారత రాష్ట్రాల నుంచి భారీగా మహిళా ప్రతినిధుల హాజరు.

