ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిఅనుమతి లేకుండా మద్యం తాగిస్తున్న  మెస్ నిర్వహణ కామారెడ్డి లో ఎక్సైజ్ దాడులు

అనుమతి లేకుండా మద్యం తాగిస్తున్న  మెస్ నిర్వహణ కామారెడ్డి లో ఎక్సైజ్ దాడులు

📰 Generate e-Paper Clip

బ్రేకింగ్ న్యూస్

అనుమతి లేకుండా మద్యం తాగిస్తున్న  మెస్ నిర్వహణ కామారెడ్డిలో ఎక్సైజ్ దాడులు

కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ ముకుంద్ రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, మెస్‌లపై ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న లక్ష్మీ మెస్లో అనుమతి లేకుండా మద్యం సేవించేందుకు అవకాశం కల్పిస్తూ మెస్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకుడు లింబయోల దిలీప్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ మాట్లాడుతూ, హోటళ్లు, మెస్‌లు, దాబాల్లో అనుమతి లేకుండా మద్యం విక్రయించినా లేదా మద్యం సేవించేందుకు అనుమతించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి అక్రమాలపై సమాచారం ఉంటే వెంటనే ఎక్సైజ్ శాఖకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, ఎస్సై విక్రంకుమార్, హెడ్ కానిస్టేబుల్ ఫరీద్, కానిస్టేబుళ్లు రాజు, దినేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!