ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎల్ నినోపై రైతులకు అవగాహన

ఎల్ నినోపై రైతులకు అవగాహన

📰 Generate e-Paper Clip

చుంచుపల్లి, జూలై 17 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పులు, వాటి వల్ల వ్యవసాయంపై పడే ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంపిక చేసుకోవడంతో పాటు, నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ప్రత్యామ్నాయ పంటల సాగు, పంట సంరక్షణ చర్యలు, వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని రైతులకు వివరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ నిర్ణయాలు తీసుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చని అధికారులు సూచించారు. రైతులు కార్యక్రమంలో పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!