భద్రాద్రి, జూలై 31 (వార్త సంధ్య) : భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో బూర్గంపహాడ్ మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ఎంపీడీవో జమలారెడ్డి సూచించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గోదావరి వరదల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరం లేకుండా నది, వాగులు, చెరువులు, కుంటలు, వరద ప్రవాహాల వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. చిన్నపిల్లలను నీటి ప్రాంతాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే 100 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. వరద ప్రభావం ఉండే ప్రాంతాల ప్రజలు ముందస్తుగా అప్రమత్తమై అధికారుల సూచనలను పాటిస్తూ అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని, అధికారులు అందించే సూచనలకు సహకరించి అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో జమలారెడ్డి విజ్ఞప్తి చేశారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎంపీడీవో జమలారెడ్డి
RELATED ARTICLES

