ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో పేలిన ప్రెషర్ కుక్కర్

ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో పేలిన ప్రెషర్ కుక్కర్

📰 Generate e-Paper Clip

హాస్టల్లో వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుక్కర్ పెట్టడంతో లావణ్య కు తీవ్ర గాయాలు

కామారెడ్డి జిల్లా, ఏప్రిల్ 25 (వార్త సంధ్య):

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో శనివారం ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో వంట చేస్తున్న సమయంలో ప్రెషర్ కుక్కర్ ఒక్కసారిగా పేలిపోవడంతో లావణ్య అనే వంటమనిషి తీవ్రంగా గాయపడింది.

వివరాల్లోకి వెళ్తే, మధ్యాహ్న సమయంలో విద్యార్థుల కోసం వంట చేస్తుండగా కుక్కర్‌లో ఒత్తిడి పెరగడంతో అకస్మాత్తుగా పేలింది. దీంతో కుక్కర్‌లో ఉన్న వేడి పప్పు లావణ్య ఒంటిపై పడటంతో ఆమెకు తీవ్రమైన కాలిన గాయాలు అయ్యాయి. సంఘటన సమయంలో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

గాయపడిన లావణ్యను వెంటనే స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!