ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో పేలిన ప్రెషర్ కుక్కర్
హాస్టల్లో వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుక్కర్ పెట్టడంతో లావణ్య కు తీవ్ర గాయాలు కామారెడ్డి జిల్లా, ఏప్రిల్ 25 (వార్త సంధ్య): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో శనివారం ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో వంట చేస్తున్న సమయంలో ప్రెషర్ కుక్కర్ ఒక్కసారిగా పేలిపోవడంతో లావణ్య అనే వంటమనిషి తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే, మధ్యాహ్న సమయంలో విద్యార్థుల కోసం వంట చేస్తుండగా కుక్కర్‌లో ఒత్తిడి పెరగడంతో అకస్మాత్తుగా పేలింది. దీంతో కుక్కర్‌లో ఉన్న వేడి...