ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మేనల్లుడికి ఎమ్మెల్యే సర్ప్రైజ్

మేనల్లుడికి ఎమ్మెల్యే సర్ప్రైజ్

📰 Generate e-Paper Clip

సింగరేణి ప్రతినిధి, ఆగస్టు 07 (వార్త సంధ్య) : వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ తిరుపతి పర్యటనలో భాగంగా తన మేనల్లుడికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. సింగరేణి మండలం రావోజీ తండాకు చెందిన బానోత్ కళ్యాణ్ నాయక్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న కళాశాలకు ఎమ్మెల్యే అకస్మాత్తుగా వెళ్లి ఆయనను కలిశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎమ్మెల్యే స్వయంగా వచ్చి పలకరించడంతో బానోత్ కళ్యాణ్ నాయక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తిరుపతికి వచ్చిన సందర్భంలో తనను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని వచ్చి కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. తన మామయ్య మాలోతు రాందాస్ నాయక్‌తో ఉన్న ఆప్యాయత, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తనను ప్రత్యేకంగా కలిసిన ఈ సందర్భం జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని కళ్యాణ్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!