హైదరాబాద్, ఆగస్టు 25 (వార్త సంధ్య): నాగోల్ డివిజన్ పరిధిలోని విజయ గార్డెన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్‌లో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్‌ను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలనీ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు చిన్నారులకు ఆటపాటలకు అనువైన వాతావరణం కల్పించేందుకు ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. కాలనీలో ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ అవసరాలను గుర్తించి సౌకర్యాలు కల్పించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు తూర్పటి చిరంజీవి, శిల్పారెడ్డి, పోచంపల్లి రాజేందర్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు రాంచంద్రరెడ్డి, మల్లారెడ్డి, సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

