ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఘనంగా తల్లిపాల వారోత్సవాల ముగింపు

ఘనంగా తల్లిపాల వారోత్సవాల ముగింపు

📰 Generate e-Paper Clip

కొత్తగూడెం, ఆగస్టు 07: తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా కూలీలైన్ 7వ సెంటర్‌లో అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ కార్పొరేటర్ హాజరై కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. చిన్నారుల ఆరోగ్యానికి తల్లిపాలు, పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు. తల్లులు, గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జై ప్రసన్నలక్ష్మి, పద్మ, ఆరోగ్యశాఖ నుంచి జ్యోతి, ఆశా కార్యకర్త దేవి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తల్లులు, బాలింతలు, గర్భిణీలకు అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!