బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ నేడు సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 7 ( వార్తా సంధ్య )
గ్రామ మాజీ సర్పంచ్ గంగారెడ్డి సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖాన్ని తట్టుకుని మనోధైర్యంతో ముందుకు సాగాలని వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న డాక్టర్ అకం బాలరాజ్ను ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సహాయం అందేలా సహకరిస్తామని హామీ ఇస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుప్రియాల్ గ్రామ ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, యువజన, మహిళా నాయకులు, కార్యకర్తలు, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

