నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జై గౌడ్ ఉద్యమం నాయకులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 30 ( వార్తా సంధ్య )
కామారెడ్డి జిల్లా నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని జిల్లా జై గౌడ్ ఉద్యమం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా జై గౌడ్ ఉద్యమం అధ్యక్షుడు రంగోల మురళీధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు కర్రోల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.
అనంతరం మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ, జై గౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ఎక్సైజ్ సూపరిండెంట్‌కు వివరించారు.
ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ, గౌడ సామాజిక వర్గం సంప్రదాయ వృత్తితో పాటు సమాజాభివృద్ధిలోనూ విశేష పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. గౌడ సంఘాల ప్రతినిధులు చేసే నిర్మాణాత్మక సూచనలను సానుకూలంగా స్వీకరిస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సుందర్ సింగ్, జిల్లా జై గౌడ్ ఉద్యమం బాధ్యులు నర్సగౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

