మంత్రి సీతక్క జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాధారు షబ్బీర్ అలీ,ఎంపీ సురేష్ శెట్కార్ తో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కళాభారతి వేదికగా జరిగిన శిశు భద్రత మరియు రక్షణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. “ప్రజల వద్దకే పాలన” అనే నినాదంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం అభినందనీయమన్నారు. యువత సోషల్ మీడియా, డ్రగ్స్‌కు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి తల్లిదండ్రులు, గురువులు, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా స్థాయి సమీక్ష సమావేశం, సఖి సెంటర్ ప్రారంభోత్సవం, స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో మహిళల విద్య కోసం నిర్వహించిన కార్యక్రమం, అలాగే దివ్యాంగులకు ఉచిత స్కూటీల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉమెన్స్ వెల్ఫేర్ స్టేట్ సెక్రటరీ అనిత రాంచంద్రన్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

