ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeతెలంగాణపెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ నకు పాల్పడితే కఠిన చర్యలు

పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ నకు పాల్పడితే కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

  • కృత్రిమ కొరతను సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు
  • పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలపై జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దు
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్హె చ్చరించారు.కొంతమంది అధిక ధరలకు విక్రయించాలనే ఉద్దేశంతో కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఇంధన నిల్వలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంయమనం పాటించాలని సూచించారు.ఎక్కడైనా పెట్రోల్ బంకుల్లో గానీ, ఇతర ప్రదేశాల్లో గానీ ఇంధనం ఉన్నప్పటికీ లేదని చెప్పడం లేదా అధిక ధరలకు విక్రయించడం జరిగితే వెంటనే స్థానిక పౌరసరఫరాల శాఖ అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మి ఇండ్లలో నిల్వలు చేసుకోవద్దని, అవసరమైన మేరకే మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!