మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి: ఏలే మల్లికార్జున్
కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యక్తుల జీవితాలతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 26 ( వార్త సంధ్య )
“మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక సేవ వంటి సానుకూల మార్గాలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునకు అనుగుణంగా “డ్రగ్ ఫ్రీ తెలంగాణ” లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన, అప్రమత్తత, సామాజిక బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రభుత్వం, పోలీసు శాఖ, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, యువత సమన్వయంతో పనిచేస్తేనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమై, ఆరోగ్యవంతమైన, సురక్షితమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

