-
చత్రపతి టీచర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్య క్షత్రియ
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 6 ( వార్త సంధ్య )
శివాజీ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా చత్రపతి టీచర్స్ సొసైటీ (సీటీఎస్) ఆధ్వర్యంలో ఆర్య క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు, మెడిసిన్, ఇంజినీరింగ్‌లో సీట్లు సంపాదించిన వారు, వివిధ ఉద్యోగాల్లో ఎంపికైన యువతతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, కౌన్సిలర్లుగా విజయం సాధించిన ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో చత్రపతి టీచర్స్ సొసైటీ అధ్యక్షుడు లోకోటి వెంకట కృష్ణారావు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తూ తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్య క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు నిట్టు వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులు ఓపిక, పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు.
కామారెడ్డి పట్టణ ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు బాలాజీ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులను గౌరవించే విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీటీఎస్ ప్రధాన కార్యదర్శి మధు, కోశాధికారి కమలాకర్ రావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పడిగల రాజేశ్వరరావు, ఎంఈఓ నిట్టూరి ఆనంద్ రావు, అంబీర్ మనోహర్ రావు, సుమిత్రా ఆనంద్ రావు, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు నిట్టూరి గంగాధర్ రావు, భోజన్నగారి వినోద్ రాజు పాటిల్, ఎస్‌ఆర్‌కే ప్రిన్సిపాల్ దత్తాద్రి, వివిధ గ్రామాల సర్పంచులు, సీటీఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

