- కరుణించిన వరుణుడు..
- ఉరుములు, మెరుపులతో దంచి కొడుతున్న వాన
భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 06 (వార్త సంధ్య) : కొత్తగూడెం పట్టణంలో శనివారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం ఉరుములు, మెరుపులతో కూడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రతతో ఉక్కపోతను ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. భారీగా వీచిన గాలులతో పాటు కురిసిన వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచింది. వర్షం ప్రారంభమైన వెంటనే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, రైతులు మాత్రం ఈ వర్షాన్ని ఆనందంగా స్వాగతించారు. వర్షం మరికొంతసేపు కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

