ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
Homeజర్నలిస్ట్మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం

మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం

📰 Generate e-Paper Clip

నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా అక్రిడిటేషన్ జారీ చేయాలి

రంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన డిస్ట్రిక్ట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన వారికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, జీఓ 252కు అనుగుణంగా అన్ని నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. అక్రిడిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని, అన్ని విషయాలు పరస్పరం చర్చించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.

అనంతరం కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు.ఈ సమావేశంలో డీపీఆర్ఓ బాలేశ్వరి, కమిటీ సభ్యులు కె. శ్రీకాంత్ రెడ్డి, శేఖర్ ఉప్పరి, సయ్యద్ ఇక్రముల్లా హుస్సైని, అన్నవరపు శేఖర్ బాబు, మహ్మద్ సిరాజ్, గంజి ప్రదీప్ కుమార్, సిహెచ్. రాంరెడ్డి, ఏం. శ్రీనివాస్, యు. శివ కుమార్, రొయ్యల రాజు, ఏఈఐఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!