ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeతెలంగాణరంజాన్ పవిత్ర మాసం ముస్లింలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది: మంత్రి శ్రీధర్ బాబు

రంజాన్ పవిత్ర మాసం ముస్లింలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది: మంత్రి శ్రీధర్ బాబు

📰 Generate e-Paper Clip

మంథని, మార్చి 16 (వార్త సంధ్య):  ముస్లీంలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ పండుగ అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం కాటారం మండల కేంద్రంలోని ఎల్ జి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లీం మత పెద్దలు, ముస్లీం సోదరులు మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లీంలు ఎంతో భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ ప్రార్థనలు నిర్వహిస్తారని అన్నారు. రంజాన్ మాసం పరస్పర ప్రేమ,సౌభ్రాతృత్వం, దయాభావాన్ని పెంపొందించే పండుగ అని పేర్కొన్నారు. అందరు కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!