ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్కోదాడ బస్టాండ్ ఎదుట దారుణం..

కోదాడ బస్టాండ్ ఎదుట దారుణం..

📰 Generate e-Paper Clip

  • భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
  • సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన

కొత్తగూడెం జిల్లా బ్యూరో / కోదాడ, మే 07 (వార్త సంధ్య) : కోదాడ బస్టాండ్ ముందు అందరూ చూస్తుండగానే ఓ మహిళను ఆమె భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. బుధవారం నాడు రాత్రి జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడేలా చేసింది. మృతురాలు శిరీష కాగా, నిందితుడు భర్త మణిదీప్గా గుర్తించారు. వీరు ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట కు చెందిన దంపతులుగా సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!