ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeతెలంగాణహనుమాన్ జయంతి శోభాయాత్రను విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

హనుమాన్ జయంతి శోభాయాత్రను విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, ఏప్రిల్ 2 (వార్త సంధ్య):
హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న శోభాయాత్రను విజయవంతం చేయాలని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సాయంత్రం 4:00 గంటలకు బి.ఎన్.రెడ్డి నగర్ చౌరస్తా నుండి సాహెబ్ నగర్‌లోని శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవాలయం వరకు భవ్య హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.

భక్తి, శక్తి, ఐక్యతకు ప్రతీకగా నిర్వహించే ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొననున్నట్లు తెలిపారు. అదేవిధంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!