హనుమాన్ జయంతి శోభాయాత్రను విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 2 (వార్త సంధ్య):హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న శోభాయాత్రను విజయవంతం చేయాలని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సాయంత్రం 4:00 గంటలకు బి.ఎన్.రెడ్డి నగర్ చౌరస్తా నుండి సాహెబ్ నగర్‌లోని శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవాలయం వరకు భవ్య హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తి, శక్తి, ఐక్యతకు ప్రతీకగా నిర్వహించే ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ...