విజేతగా నిలిచిన లయన్ వారియర్స్ జట్టు
భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 27 (వార్త సంధ్య) : చత్రపతి శివాజీ ప్రీమియర్ లీగ్ (CSPL) సీజన్–1 ఈ నెల 19న ప్రారంభమై, 26న ఘనంగా ముగిసింది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో లయన్ వారియర్స్ మరియు రుద్రా ఎలెవన్ జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన లయన్ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రుద్రా ఎలెవన్ జట్టు 170 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లయన్ వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి డా. బి.ఎస్ రావు, భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత మధు, సేవాలాల్ వారియర్స్ అధినేత లకావత్ స్వరాజ్, బండారి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు ఇరు జట్ల క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించిన నాయిని రాజేష్, బండారి సాగర్, కోల హరీష్, తెలంగాణ క్రాంతి, నిశాంత్, బైపల్లి మహేష్, నవీన్, వికాస్, దినేష్, ప్రసన్న బాబు, సాదత్, సమీర్, సాయి చరణ్, కౌశిక్, నిరంజన్, వినయ్, మనోహర్‌లను అభినందించారు. మొత్తం టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు.


