విజయవంతంగా చత్రపతి శివాజీ ప్రీమియర్ లీగ్ – సీజన్ 1 ముగింపు
విజేతగా నిలిచిన లయన్ వారియర్స్ జట్టు భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 27 (వార్త సంధ్య) : చత్రపతి శివాజీ ప్రీమియర్ లీగ్ (CSPL) సీజన్–1 ఈ నెల 19న ప్రారంభమై, 26న ఘనంగా ముగిసింది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో లయన్ వారియర్స్ మరియు రుద్రా ఎలెవన్ జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన లయన్ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రుద్రా ఎలెవన్...