ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeతెలంగాణఅన్నపురెడ్డిపల్లి శివాలయ ప్రతిష్టకు ఆహ్వానం

అన్నపురెడ్డిపల్లి శివాలయ ప్రతిష్టకు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

జిల్లా కేంద్ర గ్రంథాలయం సందర్శనలో చైర్మన్ నరసింహారావు

భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 04 (వార్త సంధ్య) : అన్నపురెడ్డిపల్లి శివాలయం టెంపుల్ చైర్మన్ నరసింహారావు శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ను మర్యాదపూర్వకంగా కలిసి, అన్నపురెడ్డిపల్లిలో జరగనున్న గుడి ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. సందర్శనలో భాగంగా గ్రంథాలయంలో ఉన్న అన్ని ఏర్పాట్లను పరిశీలించిన నరసింహారావు, అక్కడ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయం అందిస్తున్న సేవలపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఎండల మధ్య కూడా విధులు నిర్వర్తిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న గ్రంథపాలకురాలు మణిమృదులని ప్రశంసించారు. ఆమె విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అవసరాలను తీర్చడంలో కృషి చేస్తున్నారని కొనియాడారు. తదనంతరం గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో మణిమృదులని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మణిమృదుల అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!