ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homeతెలంగాణఅంగన్వాడీల సమస్యలపై డైరెక్టర్‌శృతి హోజా ను కలిసిన ఆడెపు వరలక్ష్మి

అంగన్వాడీల సమస్యలపై డైరెక్టర్‌శృతి హోజా ను కలిసిన ఆడెపు వరలక్ష్మి

📰 Generate e-Paper Clip

అంగన్వాడీల సమస్యలపై డైరెక్టర్‌శృతి హోజా ను కలిసిన ఆడెపు వరలక్ష్మి

ప్రీ-ప్రైమరీ, BLO, SIR డ్యూటీల రద్దు, పెండింగ్ జీతాలపై వినతి

హైదరాబాద్, జూన్ 24: అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై తెలంగాణ రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

అంగన్వాడీలను ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మార్చడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అవసరమైన మౌలిక సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రీ-ప్రైమరీ విభాగంలో అర్హత కలిగిన అంగన్వాడీ టీచర్లకే తొలి ప్రాధాన్యత కల్పించాలని కోరారు.

అంగన్వాడీలపై అదనపు భారంగా మారిన బూత్ లెవల్ ఆఫీసర్ (BLO), ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విధులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధులు నిర్వహించడం వల్ల అసలు సేవలకు అంతరాయం కలుగుతోందని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

అప్‌గ్రేడ్ అయిన అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన 12 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. అలాగే ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అంగన్వాడీ సిబ్బందికి జీతాలు చెల్లించేలా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమస్యలన్నింటిపై డైరెక్టర్ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆడెపు వరలక్ష్మి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రేణుక, శోభ, కవిత, శ్రీలత, లక్ష్మి, పద్మ, అనిత, రమ, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!