ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homebusiness40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిపై వేధింపులు.. అధికారులు న్యాయం చేయాలని రైతుల వేడుకోలు

40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిపై వేధింపులు.. అధికారులు న్యాయం చేయాలని రైతుల వేడుకోలు

📰 Generate e-Paper Clip

40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిపై వేధింపులు.. అధికారులు న్యాయం చేయాలని రైతుల వేడుకోల

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 21 ( వార్త సంధ్య )

 

గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ భూమిపై కొందరు వ్యక్తులు హక్కు తమదేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు ఇల్చిపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు ప్యాట్ల రమేష్, ప్యాట్ల సాయిలు ఆరోపించారు.

 

వారి కథనం ప్రకారం, ఇల్చిపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 76/1/1లో ఉన్న 23 గుంటల భూమిని 1984 సంవత్సరంలో కామారెడ్డికి చెందిన గంగ గౌడ్ (మోతే సునీల తండ్రి) తమ తండ్రి ప్యాట్ల లింగంకు పదిమంది సమక్షంలో బాండ్ పేపర్‌పై రాసిచ్చారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే భూమిలో పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు.

 

అయితే, ఇటీవల కామారెడ్డికి చెందిన మామిండ్ల లింగం, జొన్నల నర్సింలు, జొన్నల రాజశేఖర్, ప్యాట్ల శంకర్ ఈ భూమి తమదేనంటూ తమను భయభ్రాంతులకు గురిచేస్తూ, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని జిల్లా అధికారులు, పోలీసులను ప్యాట్ల రమేష్, ప్యాట్ల సాయిలు వేడుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!