ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డికామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండాపై బీజేపీ కౌన్సిలర్ల అభ్యంతరం

కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండాపై బీజేపీ కౌన్సిలర్ల అభ్యంతరం

📰 Generate e-Paper Clip

కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండాపై బీజేపీ కౌన్సిలర్ల అభ్యంతరం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 21 ( వార్త సంధ్య )

 

ఈ నెల 24వ తేదీ గురువారం నిర్వహించనున్న కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండాలోని కొన్ని అంశాలు ప్రజాధనం దుర్వినియోగానికి దారితీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ, వాటిని ఎజెండా నుంచి తొలగించాలని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గిరికి అభ్యంతర పత్రం (డీసెంట్ నోట్) సమర్పించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

 

ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ, జూలై 24న జరగనున్న మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండాలో అభివృద్ధి, పారిశుధ్యం వంటి ప్రజా ప్రయోజన అంశాల కంటే కొందరి వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి బిల్లుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

 

గత రెండు సర్వసభ్య సమావేశాల్లో కూడా ఇలాంటి బిల్లుల విషయంలో బీజేపీ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, అయినప్పటికీ మళ్లీ అదే తరహా అంశాలను ఎజెండాలో చేర్చడం దురదృష్టకరమని అన్నారు. కామారెడ్డి పట్టణంలో ప్రజాధనాన్ని ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయనివ్వబోమని స్పష్టం చేశారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!