ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeతెలంగాణమే 17 కుమ్మర సంఘం సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలి

మే 17 కుమ్మర సంఘం సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

  • ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంల
  • కుమ్మరులకు పిలుపునిచ్చిన ఏడుకొండల వెంకటేశం

ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం (టి.ఆర్.కె.ఎస్) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర కార్యవర్గ ప్రెస్‌మీట్ నిర్వహించారు. విద్యార్థి విభాగం అధ్యక్షులు డా. కంభంపాటి సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం మాట్లాడుతూ మే 17న నిర్వహించే కుమ్మర సంఘం సర్వసభ్య సమావేశానికి బాధ్యులు, సభ్యులు తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో కుమ్మరుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కుమ్మర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం మాట్లాడుతూ కార్యవర్గ సభ్యుల సమావేశానికి అందరూ సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మే 17 సమావేశం ద్వారా సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రామన్కోల్ వీరేశం, కార్యదర్శి నాగపురి నాగేష్, సహాయ కార్యదర్శి కొత్తపల్లి జయసింహ, రాచకొండ కృష్ణయ్య, గుండాల గోవర్ధన్, ఏరుకొండ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులు ఎగిరిశెట్టి వీరన్న, నిమ్మలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!