ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
Homeతెలంగాణపుస్తక పఠనం జీవితం మార్చే శక్తి

పుస్తక పఠనం జీవితం మార్చే శక్తి

📰 Generate e-Paper Clip

  • డిజిటల్ యుగంలోనూ పుస్తకాల ప్రాముఖ్యత అమూల్యం
  • పుస్తకాలతోనే వ్యక్తిత్వ వికాసం సాధ్యం
  • గ్రామీణ ప్రాంతాల్లో పఠనానికి ప్రాధాన్యం పెంచుతాం
  • పుస్తకాలు మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దుతాయి

భద్రాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 23 (వార్త సంధ్య): పుస్తకాలు మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. పుస్తక దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుస్తకాలు మనిషి జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుందని, సమాజంలో అవగాహన, చైతన్యం కలుగుతాయని తెలిపారు. ముఖ్యంగా యువత రోజుకు కనీసం ఒక గంట అయినా పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించారు. డిజిటల్ యుగంలోనూ పుస్తకాల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని, గ్రంథాలయాలు జ్ఞానానికి ఆలయాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని గ్రంథాలయాలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పాఠకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పఠన సంస్కృతి పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా, గ్రంథాలయంలో చదివి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం సాధించిన పి. ఉపేందర్రావు గ్రంథాలయానికి రూ. 5,000 విలువైన కూలర్ అందించడంతో చైర్మన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు జి. మణి మృదుల, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!