వరంగల్ జిల్లా, ఏప్రిల్ 23 (వార్త సంధ్య): రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ, శంకర్ గౌడ్ తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన సహచరులు, స్థానికులు అప్రమత్తమై వెంటనే అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను తక్షణమే వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన మరింత పెరిగింది. సమ్మె కొనసాగుతున్న తరుణంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆర్టీసీ సమ్మె వేళ ఉద్రిక్తతలు…డ్రైవర్ ఆత్మహత్యాయత్నం కలకలం
RELATED ARTICLES

