ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
Homeతెలంగాణనూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్, ఉప సర్పంచ్

నూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్, ఉప సర్పంచ్

📰 Generate e-Paper Clip

పంచాయతీ తరఫున నూతన వస్త్రాల బహుమతి

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 23 (వార్త సంధ్య) : భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో కనితి నాగమణి నిర్మించిన నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, గృహప్రవేశం చేసిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ తరఫున నూతన వస్త్రాలు అందజేసి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం అభినందనీయం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, బత్తుల శిరీష,కారం సామ్రాజ్యం, కొరసా లక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!