ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
Homeతెలంగాణరైతులకు భరోసానిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే...

రైతులకు భరోసానిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే…

📰 Generate e-Paper Clip

-వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్

పెద్దపల్లి, మంథని, ఏప్రిల్ 21(వార్త సంధ్య ): రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతులకు భరోసానిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి., మంథని ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని శ్రీరాంనగర్, గంగాపురి, శ్రీపాద కాలనీ, అంగుళూరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అలాగే సూరయ్యపల్లి, కాకర్లపల్లి, ఖానాపూర్, ఎక్లాస్ పూర్ కొనుగోలు కేంద్రాలను సర్పంచులు ఆర్ల నాగరాజు, కనవేన కొమురయ్య, సంగెం అరుణ-గట్టయ్య, బొడ్డు రజిత – శ్రీనివాస్ లు ప్రారంభించారు. అనంతరం లక్కెపూర్, తోట గోపయ్యపల్లి, గుమ్మునుర్, గాజులపల్లి, మైదుపల్లి కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. నస్తూరుపల్లి లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు యెల్లంకి వంశీధర్, మాచిడి రాజు గౌడ్, మద్దికట్ల స్రవంతి – రమేష్ బాబు,పెంటరీ రాజు, జంబోజు శ్రీమతి – సమ్మయ్య, సింగిల్ విండో మాజీ డైరెక్టర్లు ఆకుల రాజ బాపు, లెక్కల కిషన్ రెడ్డి, నాయకులు పేరవేన లింగయ్య, మంథని సత్యనారాయణ,ఆకుల శ్రీనివాస్,గుండా పాపా రావు, సేమంతుల ఓదెలు మెండె రాజయ్య, పెండ్లి ప్రభాకర్ రెడ్డి, ఆర్ల నారాయణ,మంథని శ్రీనివాస్,ఆకుల శ్రీనివాస్, కనవేన ఓదెలు, ప్రత్యూష, గోవిందుల రమేష్, భీముని వెంకట స్వామి, కెక్కర్ల మారుతి,రేపాక శ్రీనివాస్, గుంటుకు గణేష్, మహేష్,నారమల్ల శంకరయ్య, గుంజె సత్యనారాయణ, పర్షవేన మల్లయ్య, లింగమూర్తి, బిరుదు సమ్మయ్య, పెగడ రాజు, జంజర్ల శ్రావణ్, బూడిద రంజిత్, భాద్రపు శ్రీనివాస్,అప్పాల పర్వతాలు,మంథని సదానందం,సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, రైతులు, హమాలీ సంఘం నాయకులు, సంఘ సిబ్బంది,పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!