ePaper
Wednesday, June 10, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMCహైదరాబాద్‌లో వృద్ధుల గుర్తింపు కార్డుల కోసం ప్రత్యేక శిబిరాలు

హైదరాబాద్‌లో వృద్ధుల గుర్తింపు కార్డుల కోసం ప్రత్యేక శిబిరాలు

📰 Generate e-Paper Clip

ప్రజా పాలనకు ప్రజల నుంచి మంచి స్పందన

హైదరాబాద్, ఏప్రిల్ 21, వార్త సంధ్య :ప్రజా పాలన – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వృద్ధుల గుర్తింపు కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రజా పాలన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రేటర్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో వృద్ధుల గుర్తింపు కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో COలు, RPలు పాల్గొని వృద్ధులకు కార్డులను అందజేయడంతో పాటు అర్హులైన వారినుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 60 శిబిరాలు విజయవంతంగా నిర్వహించగా, 458 మంది వృద్ధులు తమ దరఖాస్తులను సమర్పించారు. శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

వృద్ధులకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిబిరాలను కొనసాగిస్తూ అర్హులైన ప్రతి వృద్ధుడికి గుర్తింపు కార్డు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!