రైతులకు భరోసానిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే…
-వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ పెద్దపల్లి, మంథని, ఏప్రిల్ 21(వార్త సంధ్య ): రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతులకు భరోసానిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి., మంథని ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని శ్రీరాంనగర్, గంగాపురి, శ్రీపాద కాలనీ, అంగుళూరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు....