ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణఅంగన్వాడీ లకు శుభవార్త

అంగన్వాడీ లకు శుభవార్త

📰 Generate e-Paper Clip

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన అంగన్‌వాడీ సిబ్బందికి తిరిగి ఉద్యోగావకాశం

వార్త సంధ్య | హైదరాబాద్ | జూన్ 13, 2026: తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు (AWWలు), అంగన్‌వాడీ సహాయకులు (AWHలు) స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి, అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళా, శిశు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ 2026 జూన్ 12న మెమో నెం.312/Prog.I/1/2026ను జారీ చేసింది.

ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులు, మెమోలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయని స్పష్టం చేస్తూ, గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పొందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పునర్నియామక అభ్యర్థనలను పరిశీలించాలని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, వారి స్థానంలో ఇప్పటికే మరో అభ్యర్థిని నియమించకపోయిన సందర్భాల్లో మాత్రమే పునర్నియామకానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో అమలు చేసిన విధానాన్నే కొనసాగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెమోలో పేర్కొంది.

ఈ ఉత్తర్వులు మహబూబాబాద్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి నుంచి వచ్చిన ప్రతిపాదనలు, అలాగే మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ నివేదిక ఆధారంగా జారీ చేసినట్లు వెల్లడించింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్ పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన అంగన్‌వాడీ సిబ్బందికి ఇది ఉపశమనం కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!